Site icon HashtagU Telugu

New CM : అతి త్వరలో తెలంగాణ కు కొత్త సీఎం – బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Mp Dharmapuri Arvind

Mp Dharmapuri Arvind

ఇప్పటికే తెలంగాణ (Telangana) లో రాజకీయ వ్యాఖ్యలు కాకరేపుతుండగా..తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind ) చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా, ముఖ్యమంత్రి పదవి (CM Post)లో మార్పు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం ను మార్చబోతుందని , సీఎం పదవికి శ్రీధర్ బాబు (Sridhar Babu అర్హత కలిగిన వ్యక్తి అంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీస్తుంది.

Praja Vedika In Vadlamanu : హామీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం – సీఎం చంద్రబాబు

మంత్రి శ్రీధర్ బాబు పేరును ప్రస్తావిస్తూ ధర్మపురి అర్వింద్ ఆయన నైతిక విలువలను ప్రశంసించారు. కానీ పార్టీ అధిష్ఠానం అర్థిక లావాదేవీల విషయంలో నిబద్ధత గల నేతలకు అవకాశం ఇవ్వకుండా పక్కన పెడుతోందన్న అభియోగం కూడా మోపారు. పార్టీకి నిధులు సమకూర్చడంలో పాల్గొనడం ఒక అర్హతలా మారిందని, శ్రీధర్ బాబు ఆ దారిలో నడవలేని వ్యక్తి కావడమే ఆయన్ను సీఎంగా ఎంపిక చేయకుండా అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కొత్త చర్చను తెరలేపాయి.

New Hero Passion Plus: మార్కెట్‌లోకి మ‌రో స‌రికొత్త బైక్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివరాలివే!

ఇక సీఎం రేవంత్ రెడ్డి పై అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బలపడటానికి రేవంత్ సహకారం కారణమని, ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ‘తురుంఖాన్’గా చూడబడిన రేవంత్, ఇప్పుడు ప్రజల దృష్టిలో ‘జోకర్’గా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు.