Site icon HashtagU Telugu

CM Revanth Reddy : గరీబోడి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి నిన్న సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో స్పందించారు. ఆయన ట్విట్టర్లో, “వందేళ్ల చరిత్రను తిరగరాస్తూ పేదలకు వైద్య సేవలు అందిస్తూ, శిథిలమైన నిన్నటి ఉస్మానియా జ్ఞాపకాల నుండి అత్యాధునిక ప్రమాణాలతో గరీబోడి పెద్ద ఆసుపత్రిని నూతనంగా ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది” అని పేర్కొన్నారు.

ఈ కొత్త భవనం గోషామహాల్ స్టేడియం వద్ద రూ.2,700 కోట్లతో నిర్మించబడుతోంది. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని అధునాతన వైద్య సౌకర్యాలతో, వైద్య సాంకేతికతను ముందుకు తీసుకువెళ్లేలా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి. ఈ ప్రాజెక్టులో 5 భాగాలుగా ఆసుపత్రి భవనం నిర్మించబడుతుంది, 26.30 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం పై 2,000 పడకలు, అందులో 500 ఐసీయూ సామర్థ్యంతో ఉండే పడకలు ఏర్పాటు చేయబడతాయి.

Red Briefcase : బడ్జెట్ బ్రీఫ్‌‌కేస్ ఎరుపు రంగులోనే ఎందుకు ? ఎన్నో కారణాలు

ప్రస్తుతం ఆసుపత్రిలో 22 వైద్య విభాగాలు అందుబాటులో ఉంటే, కొత్త భవనంలో 40 వైద్య విభాగాలు, 41 ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. ఈ ఆసుపత్రి ప్రాంగణంలో డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు, ఆధునిక హాస్టల్ సదుపాయాలు, 750 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు కూడా ఉంటాయి. 3,000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అందించడానికి ఏర్పాట్లు చేయబడతాయి.

రోజుకు 5,000 ఓపీ రోగులను చూసే సామర్థ్యంతో 30 రోబోటిక్ సర్జరీలు నిర్వహించనున్నారు. ఈ కొత్త భవనం రెండేళ్లలో పూర్తయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా స్కైవాక్ నిర్మాణం, నాలుగు దిక్కుల వైశాలమైన రోడ్లు, అత్యవసర సమయంలో రోగిని తరలించడానికి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

New Registration Charges : ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. కానీ

https://x.com/revanth_anumula/status/1885552975223152819