Elgandal Fort : ఎల్గండల్ కోట ను డెవలప్ చెయ్యండి అంటూ స్మిత సబర్వాల్ కు నెటిజన్ ట్వీట్

Elgandal Fort : కరీంనగర్ జిల్లా ఎల్గండల్ కోట గురించి ఓ నెటిజన్..పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు ట్వీట్ చేసి...ఎల్గండల్ కోట గురించి మాట్లాడుకునేలా చేసాడు.

Published By: HashtagU Telugu Desk
Elgandal Fort

Elgandal Fort

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్ని ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని మాత్రమే చాలామందికి తెలుసు..వీటి గురించే మాట్లాడుకోవడం , సందర్శించడం చేస్తున్నారు. కానీ బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయి. కాకపోతే వాటిని పెద్దగా గుర్తించకపోవడం , పట్టించుకోకపోవడం వల్ల అవి కనుమరుగైపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా ఎల్గండల్ కోట గురించి ఓ నెటిజన్..పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు ట్వీట్ చేసి…ఎల్గండల్ కోట గురించి మాట్లాడుకునేలా చేసాడు. ఇటీవలే స్మిత..తెలంగాణ ప్రభుత్వ యువజన అభివృద్ధి, పర్యాటక & సంస్కృతి కార్యదర్శిగా (Secretary for Youth Advancement, Tourism & Culture, Govt of Telangana) కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలు చేపట్టడం ఆలస్యం తన పనితీరుతో వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలో ఎల్గండల్ కోట (Elgandal Fort) గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు.

కరీంనగర్ జిల్లా (Karimnagar) ఎల్గండల్ కోట ఒక ప్రాచీన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం. కోట నిర్మాణం 16వ శతాబ్దానికి చెందింది. ఈ కోట చరిత్రలో ఎన్నో కథలు, ఎన్నో కట్టడాలు అందులో ఉన్నాయి. ఈ కట్టడాలు పర్యటకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే అద్భుతమైన పర్యాటక ప్రదేశం(Tourist Spot)గా మారేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ముందుగా దీనికి కొంతమేర డెవలప్ చేయాల్సి ఉంటుంది. కోటలో పర్యాటకులు ఆకట్టుకునే విధంగా ఉండాలంటే కోట పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా, శుభ్రత, సౌకర్యాలు, యాక్సెసిబిలిటీ వంటి వాటిపై దృష్టి పెడితే, పర్యాటకుల తాకిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇతర చారిత్రక ప్రదేశాల మాదిరిగా, ఎల్గండల్ కోటలో కూడా జ్ఞాపక చిహ్నాలుగా నిలిచి ఉన్న కళా, నిర్మాణ శిల్పం, ఇంకా పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతులను అందించగలిగే ఆహారం, కళా కార్యక్రమాలను ఏర్పాటుచేసే అవసరం ఉంది. స్థానిక కళలను ప్రోత్సహించేందుకు, వర్క్‌షాపులు, సాంప్రదాయ వంటకాలు, కళారూపాలను ప్రదర్శించే ప్రదేశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది’ అంటూ సదరు నెటిజన్ స్మిత కు ట్వీట్ చేసాడు. మరి ఈ కోట పై స్మిత దృష్టి పెట్టాలని అంత కోరుకుంటున్నారు.

Read Also : Nara Lokesh : లోకేష్ మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే

  Last Updated: 28 Dec 2024, 02:05 PM IST