Site icon HashtagU Telugu

Nerella : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా నేరళ్ల శారద

Nerella Sharada Is The Chai

Nerella Sharada is the chairperson of the Telangana State Women's Commission

Nerella Sharada Mahila Commission Chairperson: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ నాయకురాలు నేరెళ్ల శారదను నియమించింది. తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ… నాపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మహిళలపైన జరుగుతున్న అకృత్యాలపై అవగాహన కల్పిస్తానని వివరించారు. మహిళల సంరక్షణతో పాటు పురుషులు స్త్రీలను గౌరవించే విధంగా పని చేస్తామన్నారు. మహిళా కమిషన్ సమీక్ష సమావేశం తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద. మహిళల కోసం 5వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని.. మహిళా సంఘాల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని వివరించారు.

కాగా, నేరెళ్ల శారద బుద్ద భవన్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. నేరెళ్ల శారద పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క నేరెళ్ళ శారదకి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

Read Also: Rohit Sharma: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు రోహిత్..?