Neelam Madhu : లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా..!!

కాంగ్రెస్ మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉంటుందని... అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు

  • Written By:
  • Publish Date - May 1, 2024 / 12:32 PM IST

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Election Campaign) సమ్మర్ వేడిని మించిపోతుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన దూకుడు ను కనపరుస్తూ..బిజెపి , బిఆర్ఎస్ ఫై విమర్శల దాడి చేస్తూ వస్తుంటే..ఇటు లోక్ సభ అభ్యర్థులు తమదైన శైలి లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక మెదక్ స్థానానికి గాను కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన నీలం మధు (Medak Lok Sabha Candidate Neelam Madhu)..లక్ష మెజార్టీ తో విజయం సాదించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉంటుందని… అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలలో మాయమాటలు చెప్పే పార్టీల మాటలు నమ్మవద్దని.. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజల సమస్యలు తీరుతాయని , కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమంటున్నారు. ఉదయం నుండే మధు ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

బుధవారం ఉదయం బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్ని గ్రౌండ్‌ వద్దకు వెళ్లి వాకర్లు, ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్లు, యువతను కలిసి వరుస సమస్యలు , మెదక్ కు కావాల్సిన సదుపాయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రధానంగా బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌తోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను నీలం మధుకు తెలియజేసారు. వరి సమస్యలు తప్పకుండ తీరుస్తానని మాట ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మెదక్ గడ్డ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రధాని అయిన స్వర్గీయ ఇందిరా గాంధీ పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించారని మధు గుర్తు చేసారు. ఈ ప్రాంతంలో బీహెచ్ఈఎల్‌ను నెలకొల్పడం ద్వారా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. అలాగే బీడీఎల్, ఈక్రిశాట్, ఓడీఎఫ్ వంటి గవర్నమెంట్ సెక్టార్లన్నీ మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు.

యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా గెలిచాక ఎంపీ, సిఎస్ఆర్ ఫండ్స్ తో వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధి, ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్లూరు నరసింహారెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,113 డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అన్వర్ పటేల్, అరుణ్ గౌడ్, శేఖర్, మెట్టు కృష్ణ, తూర్పు శ్రీను, బిహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

Read Also : Naveen Chandra: నవీన్ చంద్రకు అరుదైన గౌరవం.. తెలుగు హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్