Site icon HashtagU Telugu

‘TS’ నంబర్ ప్లేట్ మార్చుకోవాలా..? – అయోమయంలో వాహనదారులు !

Ts Num

Ts Num

ఆదివారం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోగా..వాటిలో TS ను TG గా మారుస్తున్నట్లు ( Telangana Name From TS to TG Change) తీసుకున్న నిర్ణయం ఫై ప్రజలు అయోమయం అవుతున్నారు. ఇప్పటికే ఓసారి నెంబర్ ప్లేట్ మార్చడం జరిగింది..ఇప్పుడు మరోసారి మార్చాలా..? ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకుంటే పోవడమే మా పనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు TS ప్లేట్ మార్చాలా..వద్దా అనేది అర్ధం కాక అయోమయం అవుతున్నారు.

ప్రస్తుతమైతే.. పాత వాహనదారులు TGగా మార్చుకోవాలనే ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే TG అని నంబర్ ప్లేట్ వస్తుంది. పాత వాహనాల నంబర్ ప్లేట్లు కూడా మార్చాలని నిర్ణయిస్తే సర్కార్ దానిపై ప్రకటన చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు పాత వాహనాలకు కూడా TG గా మార్చుకోవాలని మాత్రం చెప్పలేదు..సో ఖంగారుపడి అయోమయానికి గురికాకండి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఫై మాత్రం వాహనదారులు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు శాశ్వతం కాదు..ఒకే పార్టీ ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించదు. ప్రజలు నిత్యం మార్పు కోరుకుంటారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో..?ఆ పార్టీ వస్తే ఏంచేస్తుందో..? ఒక్కసారి వారికీ ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏమాత్రం అభివృద్ధి చేస్తారో..? అంటూ ప్రజలు లెక్కలు వేసుకుంటుంటారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చేసారు.

పేరు మారిస్తే ఏముంది..రాష్ట్రాన్ని మీరు ఎంత అభివృద్ధి చేస్తారో నిరూపించండి..ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందజేస్తారో చెప్పండి..ప్రజలు కోరుకుంటున్న తెలంగాణను తీసుకురండి..నిత్యావసర ధరలు తగ్గించండి..రాష్ట్రాన్ని అప్పులనుండి బయట పడేలా చెయ్యండి..నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించండి..కొత్త ప్రాజెక్టులు కట్టండి..ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసి గత ప్రభుత్వం కంటే మీమే బెటర్ అని నిరూపించుకోండి అంతే తప్ప..ఆ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది..ఆ పాట పెట్టింది..మీము మారుస్తాం…మాకు అది నచ్చలేదు అన్నట్లు మార్చుకుంటూ పోతే..గత ప్రభుత్వానికి , మీ ప్రభుత్వానికి తేడా ఏముంది..ఇద్దరు ఒక్కటే కదా..పేరు మార్చడం కంటే ..మీ గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియజేసి శభాష్ కాంగ్రెస్ అనిపించుకోండి. అంతే కానీ పేర్లు మార్చుకుంటూ వెళ్ళకండి అంటూ సలహా ఇస్తున్నారు.

Read Also : Mulugu: మేడారం జాతరకు 1000 మంది పోలీసులతో బందోబస్తు

Exit mobile version