Site icon HashtagU Telugu

Covid Positive: తెలంగాణాలోని విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona New

Corona New

కరోనా కేసులు తగ్గుతున్నాయని అనుకునే లోపే మళ్ళీ కొత్త వేరియంట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. పూర్తిగా జీరోకి వస్తోన్న కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని విద్యాసంస్థల్లోనే బల్క్ కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలే హైదరాబాద్ లోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలోని విద్యార్థుల్లో పదులసంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. తాజాగా
సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డట్లు సమాచారం. ఆ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు చదువుతుండగా, 27 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తాజాగా అక్కడి 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

ఆ విద్యాసంస్థలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నమూనాలను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్లు సమాచారం. కరోనా సోకిన విద్యార్థులను హోస్టల్‌లోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.

తాజాగా ముత్తంగి గురుకుల పాఠశాలలోని ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో పాఠశాల అధికారులు పాఠశాలలోని విద్యార్థులందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక పెరుగుతున్న కేసులు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.