Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు నుంచి ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ అధ్యయనం

  NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ […]

Published By: HashtagU Telugu Desk
Kaleshwaram Project

Kaleshwaram Project

 

NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అన్నారం, మేడిగడ్డ (Medigadda Barrage), సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ- ఎన్‌డీఎస్ఏ ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్‌ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా, యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, అమితాబ్‌ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది.

హైదరాబాద్‌ జలసౌధలో ఈ నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో (Irrigation Minister Uttam Kumar Reddy) సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరినట్లు వివరించారు. తెలంగాణ సర్కార్ కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపడంపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

“చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరాం. కమిటీకి మా తరపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరాం. ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపింది.”

read also : Election Commission : రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీఐ కీలక సూచనలు

ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఈరోజు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనుంది. కాసేపట్లో మేడిగడ్డకు బయలుదేరనున్న కమిటీ మధ్యాహ్నం 1:30 గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్థ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది.

  Last Updated: 07 Mar 2024, 12:27 PM IST