Site icon HashtagU Telugu

Nature VS Development : ప్రకృతి VS అభివృద్ధి.. మీరు ఎటువైపు?

Nature Vs Development

Nature Vs Development

హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి(Kancha Gachibowli Land)ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం (TG Govt) తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. నగరానికి ఆక్సిజన్ (Oxygen) అందించే ఈ హరితవనం వేలాది చెట్లతో కూడిన ప్రకృతి రత్నంగా ఉంది. అయితే ఈ భూమిని వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించాలని ప్రభుత్వ ప్రణాళిక ఉండటంతో ప్రకృతి ప్రేమికులు, HCU విద్యార్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ధ్వంసం కాకుండా సంరక్షించుకోవాలని, అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని అణిచివేయడం తగదని వారు వాదిస్తున్నారు.

Nithyananda : నిత్యానంద చనిపోలేదు..క్లారిటీ వచ్చేసింది

ఇక మరోవైపు అభివృద్ధిని ప్రోత్సహించే వర్గాలు మాత్రం ఇది తప్పనిసరి మార్గమని పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రదేశాలు కూడా ఇలాగే అభివృద్ధి చెందాయని, నగరం అభివృద్ధి చెందాలంటే కొంతమేర ప్రకృతికి నష్టం కలుగడం సహజమని అంటున్నారు. రోడ్లు, భవనాలు, ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల సమాజానికి ప్రయోజనం కలుగుతుందని అభివృద్ధి వాదులు చెబుతున్నారు. అయితే ఇది నగరంలోని పర్యావరణ సమతౌల్యం కోసం ముప్పు తెచ్చే పరిణామమా? అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.

HCU Land Issue : విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్

ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అభివృద్ధి కొనసాగించాలంటే పర్యావరణ పరిరక్షణను కూడా సమన్వయం చేయడం అవసరం. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనే సూత్రాన్ని అనుసరించి, అర్బన్ ప్లానింగ్‌లో పచ్చదనాన్ని కాపాడే మార్గాలను అన్వేషించాలి. నగరం అభివృద్ధి చెందుతూనే ప్రకృతి సహజ అందాలను నిలుపుకోవాలంటే సరైన ప్రణాళికలు, సమతుల్యత ఉండాలి. మరి మీరు ప్రకృతి వైపు? లేక అభివృద్ధి వైపు?