Site icon HashtagU Telugu

Caste Census : కులగణన ప్రక్రియతో దేశ వ్యాప్తంగా ప్రధాని పై ఒత్తిడి: సీఎం రేవంత్ రెడ్డి

Nationwide pressure on Prime Minister with caste census process: CM Revanth Reddy

Nationwide pressure on Prime Minister with caste census process: CM Revanth Reddy

Caste Census : కేబినెట్‌ భేటీ తర్వాత సీఎం రేవంత్‌ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశ వ్యాప్తంగా ప్రధాని పై ఒత్తిడి పెరుగనుందని.. అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలని డిమాండ్ రాబోతుందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు.

Read Also: Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో తొలి 2 వన్డే మ్యాచ్‌లకు బుమ్రా దూరం, కార‌ణ‌మిదే?

2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించాం. బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ కి రాని వాళ్లు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ల గతి ఏంటో? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణన ఆధారంగానే సీట్ల కేటాయింపు.. పదవుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీని మేము పరిగణనలోకి తీసుకోవడం లేదని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలి కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాకపోతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్‌ను పరిగణలోకి తీసుకోబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కులగణన రాజకీయం కోసం చేయడం లేదు ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకుటుందని.. కమిషన్ తగిన నిర్ణయం తీసుకొంటుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ప్రొసీజర్ లో భాగమని రేవంత్ అన్నారు.

Read Also: Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో తొలి 2 వన్డే మ్యాచ్‌లకు బుమ్రా దూరం, కార‌ణ‌మిదే?