సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్నది 1928 ఫిబ్రవరి 28. అందువల్ల ఆ తేదీన జ్ఞాపకార్థం జాతీయ సైన్స్ డే ను జరుపుకుంటాం. మన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి, మన జీవితాలను సరళతరం చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. అలాంటి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి లోని స్థానిక శ్రీ చైతన్య (సత్తుపల్లి విద్యాలయం మరియు కృష్ణవేణి ) పాఠశాలలో సైన్స్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున తమ సైన్స్ ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా కమాండర్ శ్రీ. పి. వెంకట రాములు, డిప్యూటీ జిఎమ్ సింగరేణి వెంకట చారిలు హాజరయ్యారు. ముందుగా పాఠశాలలో సీవీ.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను దగ్గర ఉండి , వాటిని పరీక్షించి..అవి ఎలా రూపొందించారో , అవి ఎలా వర్క్ అవుతాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి కృషిని, మేధాశక్తిని అభినందించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూసి చాల గర్వంగా ఫీల్ అవుతూ..విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు , ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. సైన్స్ ఆవిష్కరణలపై వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు సైన్స్ అంశాలపై దృష్టి ఉంచి పరిశోధనలో రాణించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యాజమాన్యం చైర్మన్ ఎమ్. శ్రీధర్ , ఎమ్. శ్రీవిద్య , డీజీఎం చేతన్ మరియు ఏజీఎం రమేష్ గార్లకు ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్