Site icon HashtagU Telugu

National Parties : రేవంత్ రెడ్డి, బండి హామీల‌కు గ్యారంటీ ఎవ‌రు?

BJP-Congress

Revanth Reddy

జాతీయ పార్టీల‌కు (National Parties) దేశ వ్యాప్తంగా ఒక‌టే ఎజెండా ఉండాలి. ఒకే మేనిఫెస్టోను(Manifesto) విడుద‌ల చేసిన రోజులు చూశాం. కానీ, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల‌కు అనుగుణంగా మేనిఫెస్టోల‌ను మార్చేసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల‌కు స‌రిప‌డే మేనిఫెస్టోను జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వినిపించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఎన్నిక‌ల జ‌రిగిన రాష్ట్రాల్లోనూ మేనిఫెస్టోల‌ను విభిన్నంగా త‌యారు చేశారు. వాటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పంథాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందుకున్నారు.

జాతీయ పార్టీల‌కు  దేశ వ్యాప్తంగా ఒక‌టే ఎజెండా (National Parties)

సాధార‌ణంగా జాతీయ పార్టీల‌కు(National Parties) అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. దాని అనుమ‌తి లేకుండా ఎలాంటి హామీల‌ను ఆయా రాష్ట్రాల్లోని నాయ‌క‌త్వాలు ఇవ్వ‌డం ఈ మ‌ధ్య గ‌మ‌నిస్తున్నాం. ప్ర‌జాసంగ్రామ యాత్ర చేసిన బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కూడా చాలా హామీల‌ను ఇచ్చారు. ఆయ‌న‌కు మించిన హామీల‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంబంధంలేకుండా ధరణి పోర్టల్ రద్దును ప్ర‌క‌టించారు. దానికి వరంగ‌ల్ వేదిక‌గా రాహుల్ గాంధీతో ఆమోద‌ముద్ర వేయించారు. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తోన్న రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. 5 లక్షలు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

రూ. 500ల‌కు సిలెండ‌ర్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాల్సి వ‌స్తుంద‌ని….

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే క‌ర్ణాట‌క , చ‌త్తీస్ గ‌ఢ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ మీద ప్ర‌భావం ప‌డ‌నుంది. సిలిండ‌ర్ ను రూ. 500ల‌కు ఇస్తామ‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ పార్టీ మెడ‌కు దేశ వ్యాప్తంగా(Manifesto) చుట్టుకోనుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనివార్యంగా రూ. 500ల‌కు సిలెండ‌ర్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాల్సి వ‌స్తుంద‌ని ఆ పార్టీలోని కొంద‌రు భావిస్తున్నారు. అలాగే, రూ. 2ల‌క్ష‌ల రుణ‌మాఫీని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దాన్ని కూడా దేశ వ్యాప్తంగా ప్ర‌క‌టించ‌క‌పోతే, ఆ పార్టీకి దేశ స్థాయిలో న‌ష్టం చేకూరే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఆయా రాష్ట్రాల ప‌రిధిలోని అంశాల‌కు బ‌దులుగా జాతీయ స్థాయిలో(National Parties) చేసే హామీల‌ను కూడా రేవంత్ రెడ్డి చేయ‌డం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది.

జాతీయ వాదంలో ప్రాంతీయ భావాన్ని చూపించ‌డానికి కాంగ్రెస్..

జాతీయ పార్టీగా(National Parties) జాతీయ‌వాదాన్ని బ‌లంగా వినిపిస్తోన్న బీజేపీ వ‌న్ నేష‌న్ -వ‌న్ రేష‌న్‌, వ‌న్ నేష‌న్‌-వ‌న్ సిటిజ‌న్ షిప్, వ‌న్ నేష‌న్‌-వ‌న్ ర్యాంకు..ఇలా త‌దితరాల‌ను ఒక‌టేగా చెబుతూ హామీల‌ను మాత్రం ఆయా రాష్ట్రాల‌కు విడివిడిగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంటే, జాతీయ వాదంలో ప్రాంతీయ భావాన్ని చూపించ‌డానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయి. ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త దేశంలోని రాష్ట్రాల్లో సంస్కృతులు, సంప్ర‌దాయాలు వేరుగా ఉంటాయి. ఉత్త‌ర భార‌త‌దేశానికి భిన్నంగా ఉంటాయ‌ని తెలిసిందే. ప్ర‌జ‌ల మ‌నోభావాలు కూడా భిన్నంగా ఉంటాయ‌ని ఆ పార్టీలు గ్ర‌హించాయి. ఉత్త‌ర భార‌త దేశ అధిష్టానాలు ఆ పార్టీల మీద స్వారీ చేస్తున్నాయి. వాళ్ల మ‌నోభావాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటే ద‌క్షిణ భార‌త దేశంలో రాజ‌కీయ న‌ష్టం జ‌రుగుతుంది. అందుకే, పోటీపడి ద‌క్షిణ భార‌త దేశ రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల‌ అధ్య‌క్షులు ఎవ‌రికివారే ప్రాంతీయ పార్టీల‌ను మించిన హామీల‌ను(Manifesto) గుప్పిస్తున్నారు.

Also Read : Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

జాతీయ పార్టీల‌కు (National Parties) చెందిన రాష్ట్రాల అధ్య‌క్షుల హామీల‌ను ఎంత వ‌ర‌కు విశ్వ‌సించ‌డానికి అవ‌కాశం ఉంది? వాటిని అమ‌లు చేసే ప‌రిస్థితి ఉందా? అంటే దాదాపుగా ఉండ‌ద‌ని చెప్ప‌డానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ. ఆనాడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ త‌రువాత పార్ల‌మెంట్ వేదిక‌గా డిమాండ్ చేయ‌లేక‌పోయింది. దానికి కార‌ణంగా యూపీఏలోని భాగ‌స్వామ్య ప‌క్షాలు దానికి క‌లిసి రాలేదు. యూపీఏ-2 స‌మ‌యంలో ఏపీ విభ‌జ‌న జ‌రిగింది. నాయ‌క‌త్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కింద భాగ‌స్వామ్య పార్టీలు భావించాయి. అందుకే, ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి పార్లమెంట్ వేదిక‌గా డీఎంకే ముందుకు రాలేదు. అంటే, రాష్ట్రాల అధ్య‌క్షులు ఇచ్చే హామీలు వాళ్ల‌కు సంబంధించిన‌విగా చూడాల్సిందే.

Also Read : Revanth Reddy : BRS,కాంగ్రెస్`పొత్తు`పై కోమ‌టిరెడ్డి పొడుపు! కాంగ్రెస్లో క‌ల్లోలం!!

ప్రస్తుతం హామీలు గుప్పిస్తోన్న రేవంత్ రెడ్డి సీఎం అవుతార‌ని న‌మ్మ‌కం గ్యారంటీ లేదు. ఆయ‌న కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుని హోదాలో మాత్ర‌మే హామీలు ఇస్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న సీఎం అవుతార‌ని చెప్ప‌లేం. ఎన్నిక‌ల‌కు ముందుగా సీఎం అభ్య‌ర్థిని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించ‌దు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత మాత్ర‌మే సీల్డ్ క‌వ‌ర్ లో సీఎం ను ఎంపిక చేస్తుంది. అప్పుడు రేవంత్ కు బ‌దులుగా ఇత‌రుల‌కు సీఎం ప‌ద‌వి ద‌క్కితే, ఆయ‌న ఇచ్చిన హామీల‌కు గ్యారంటీ లేదు. పోనీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ హామీల‌కు గ్యారంటీ ఇస్తుందా? అంటే అలా జ‌ర‌గ‌డానికి అవ‌కాశంలేదు. ఎందుకంటే, ఆయ‌న హామీల‌కు గ్యారంటీ ఇస్తే దేశ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేర‌కు జాతీయ స్థాయి మేనిఫెస్టో(Manifesto) ప్ర‌క‌టించాలి. ఇలాంటి స‌మ‌స్య బీజేపీ తెలంగాణ చీఫ్ హామీల‌కు కూడా ఉంది. అంటే, జాతీయ పార్టీల‌కు(National Parties) చెందిన రాష్ట్రాల అధ్య‌క్షులు ఇచ్చే హామీలు గాలిమూట‌ల‌న్నమాట‌.