Site icon HashtagU Telugu

Cantonment Assembly By Elections 2024 : కాంగ్రెస్‌ కంటోన్మెంట్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌

Narayana Sriganesh

Narayana Sriganesh

హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో (Cantonment Assembly By Elections 2024) కాంగ్రెస్ తరుపున నారాయణ శ్రీగణేష్‌ (Narayana Sriganesh) బరిలోకి దిగుతున్నారు. నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత కంటోన్మెంట్ లో విజయం సాధించారు. అయితే రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో… అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. ఇది ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నటైంలో కాంగ్రెస్ పోటీకి సిద్ధమైంది. అక్కడ తమ పార్టీ అభ్యర్థిగా శ్రీగణేష్‌ను ప్రకటించింది. ఆయన గత ఎన్నికల్లో బీజేపీ తరఫున లాస్యపై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి, పోటీ చేయబోతున్నాడు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ఇక మే 13 న తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈరోజు సాయంత్రం తుక్కుగూడ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభకు రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే సభ వేదిక వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను తెలుపనున్నారు. అలాగే బిఆర్ఎస్ నుండి పలువురు నేతలు ఈరోజు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఆ నేతలు ఎవరా అనేది సస్పెన్స్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘విజయభేరి’ పేరిట తుక్కుగూడలో భారీ సభ పెట్టి.. ఆరు గ్యారంటీ హామీల ప్రకటన చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అదే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికలకు అదే వేదిక నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతోంది.

ఇక సభా ప్రాంగణంలో మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేయగా, ప్రధాన స్టేజీ మీద 300 మంది కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. లక్ష మంది మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎల్​ఈడీ (LED) స్క్రీన్లు అమర్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు సభకు తరలివస్తారని పార్టీ భవిస్తూ..అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సభ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా బయట ప్రాంతాల నుంచి తరలివచ్చే జనానికి మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఎవరూ వడ దెబ్బకు గురి కాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also : Cyrus Mistry : భారతదేశపు ‘అత్యంత ధనవంతులు’.. 30 ఏళ్లలోపు బిలియనీర్లు