Nara Lokesh : తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటనలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని, తెలంగాణ ప్రజలు టీడీపీపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకం తమకు గొప్ప ప్రేరణగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ప్రగతికి సంకేతమని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Chiranjeevi : గేమ్ ఛేంజర్ నెగిటివిటీపై మాట్లాడిన తమన్.. డియర్ తమన్ అంటూ స్పందించిన చిరంజీవి..
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “ఎన్టీఆర్ పేరు కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు; అది ఒక ప్రభంజనం. ఆయన సినీరంగంలో అనేక విశేషాలు సృష్టించి తనదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక చర్యలను చేపట్టారు. రెండు రూపాయలకే బియ్యం అందించిన తొలి నేతగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి, సమానత్వానికి పునాది వేసిన గొప్ప నేతగా చరిత్రలో నిలిచారు. తెలుగు ప్రజలను గర్వపడేలా చేసిన ఎన్టీఆర్ ఆశయాలను మేము నెరవేరుస్తాము” అని లోకేశ్ వెల్లడించారు.
నారా లోకేశ్ ఎన్టీఆర్‌తో అనుభవించిన కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. “మా చిన్నతనంలో ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆయన అబిడ్స్‌లో నివసించేవారు. ఒకసారి ఆయన స్వయంగా పెద్ద కారులో మమ్మల్ని గండిపేటకు తీసుకెళ్లారు. రహదారి మధ్యలో లెఫ్ట్, రైట్ గుర్తు లేక రోడ్డు మధ్యలో కొంచెం గందరగోళానికి లోనయ్యారు. ఆ సంఘటన మా అందరికీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం” అన్నారు.
తెలంగాణలో టీడీపీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు. “తెలంగాణలో టీడీపీకి ప్రాచుర్యం ఉంది. ఇంతటి అభిమానం ఉన్న కారణంగానే ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండానే 1.60 లక్షల మంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి. త్వరలోనే కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తాం” అని అన్నారు.
“ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేము కట్టుబడి ఉన్నాము. పార్టీని మరింతగా బలపడేలా, నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతాం. ప్రజలతో మమేకమవుతూ, వారి సంక్షేమం కోసం ఎన్టీఆర్ చూపించిన మార్గాలను అనుసరిస్తాం” అంటూ నారా లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు.
Liquid Blush or Powder Blush : లిక్విడ్ బ్లష్ లేదా పౌడర్ బ్లష్ ఏది ఉత్తమమో తెలుసా..?