అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి బిఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచి కారులో తిరిగిన వారంతా ఇప్పుడు వరుసపెట్టి కారు దిగుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , ఎమ్మెల్సీ లు , ZPTC , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల దగ్గరి నుండి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఇలా చాలామంది పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ను వీడగా …తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ (Nannapuneni Narender) మరో రెండు రోజుల్లో బిఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
కేవలం ఈయన మాత్రమే కాదు ఈయనతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 1995 లో టీడీపీ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1995 నుండి 2009 వరకు టీడీపీ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగాడు. ఆ తర్వాత 2009 లో బిఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుండి కూడా బిఆర్ఎస్ లో కొనసాగుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడ పెద్దగా లేకపోవడం తో ఇంకా ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని భావించి బిఆర్ఎస్ ను వీడేందుకు డిసైడ్ అయ్యాడని ఆయన వర్గీయులు అంటున్నారు. మరి బిజెపి లో ఎప్పుడు చేరబోతున్నారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
Read Also : YS Sharmila : జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంది – షర్మిల