తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి భారీ షాక్ తగిలింది. కీలక నేత పార్టీ కి రాజీనామా చేసారు. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది. బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుండడం తో రోజు రోజుకు కాంగ్రెస్ బలం పెరగడంతో పాటు ప్రజల్లోను కాంగ్రెస్ ఫై సానుభూతి పెరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ బాట పడ్డటం.. కాంగ్రెస్ అధిష్టానం వారికీ టికెట్ హామీలు ఇస్తూ పార్టీ లోకి తీసుకుండడం తో…ఇంతకాలం పార్టీ కోసం కష్టపడినా వారికీ టికెట్ ఇవ్వకుండా బిఆర్ఎస్ నుండి వచ్చిన వారికీ టికెట్ ఇవ్వడం ఫై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మల్కాజ్ గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanthrao) చేరికతో కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత నందికంటి శ్రీధర్ (Nandikanti Sreedhar) ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కొద్ది సేపటి క్రితం లేఖ రాశారు.
We’re now on WhatsApp. Click to Join.
1994 నుంచి నిజాయితీగా తాను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాని , 2018లోనే తనకు కాంగ్రెస్ టికెట్ దక్కాల్సి ఉన్నా.. పొత్తుల్లో భాగంగా దక్కలేదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని ఆశించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన మైనంపల్లి హన్మంతరావు ను పార్టీలోకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తనను కాదని మైనంపల్లి కుటుంబానికి ఏకంగా రెండు టికెట్లు ఇవ్వడానికి పార్టీ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు దక్కదన్న నిర్ణయానికి తాను వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు నందికంటి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరి నందికంటి నెక్స్ట్ ఏ పార్టీ లో చేరతారనేది చూడాలి.
Read Also : ‘Satyameva Jayathe’ Deeksha : టీడీపీ నేతల ‘సత్యమేవ జయతే’ దీక్షలు విరమణ