Gaddar Awards: నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డుల పేరు ఇకపై గద్దర్ అవార్డుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దాని ప్రకారం ఇకపై నంది అవార్డ్స్ కాకుండా గద్దర్ అవార్డ్స్ గా పిలవనున్నారు.
ప్రతి ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను అందిస్తుంది. సంవత్సర కాలంలో చిత్ర సీమలో ప్రతిభ కనబర్చిన వారికీ ఈ అవార్డులతో సత్కరిస్తారు. కాగా ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవార్డుల్ని ప్రదానోత్సవం చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నంది అవార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ ఈ విషయం వెల్లడించారు. గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని చెప్పారు.