Site icon HashtagU Telugu

Revanth Reddy : రేవంత్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ

Revanth reddy

Revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌తలు స్వీక‌రిస్తున్నందుకు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారని.. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నానని బాల‌కృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షించారు. సీఎల్పీనేత‌గా రేవంత్ రెడ్డిని నిన్న సాయంత్రం ఏఐసీసీ ప్ర‌క‌టించింది. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాల మేర‌కు అధిష్టానం సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్ర‌క‌టించింది. రేపు (డిసెంబ‌ర్ 7వ తేదీ) సీఎంగా రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్నారు. ప్ర‌మాణ‌స్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ, ఖ‌ర్గేతో పాటు ప‌లువురు ఏఐసీసీ ముఖ్య నేత‌లు హాజ‌రుకానున్నారు. సీఎంతో పాటు కొంత మంది మంత్రులు కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశం ఉంది.

Also Read:  Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది

Exit mobile version