Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే బాలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు కూడా హాజరు అయ్యారు. అయితే సీఎం రేవంత్ గతంలో టీడీపీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి మొదటిగా కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పుడు తాజాగా బాలయ్య సీఎంని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా త్వరలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ పదవి చేపట్టి దాదాపు 20 రోజుల తర్వాత సినీ ప్రముఖులు విశేష్ చెప్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిత్ర పరిశ్రమ సఖ్యతగా వ్యవహరించింది. కేటీఆర్ కు సినీ ప్రముఖులు స్నేహంగా మెలిగేవారు. ఇప్పుడు సీఎం మారడంతో అదే స్నేహాన్ని ప్రస్తుతం సీఎం తోనూ కొనసాగించాలని అనుకుంటున్నారు.
Also Read: Bigg Boss7 Shivaji : మెగా ఫ్యామిలీ గురించి శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు