నాగార్జున ఫ్యామిలీ (Nagarjuna Family) పై చేసిన కామెంట్స్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha )కు నాంపల్లి కోర్టు (Nampally COurt) సమన్లు జారీ చేసింది. నాగార్జున వేసిన పరువునష్టం కేసులో సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టు డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి సురేఖను కోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంతల విడాకులకు కారణం కేటీఆరేనని, కేటీఆర్ వల్లే ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్ నుంచి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై ఆమె వ్యాఖ్యలను తప్పు బట్టింది. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన నాగార్జున ఆమెపు పరువు నష్టం దావా వేశారు. దీనిపై కొద్దీ రోజులుగా విచారణ జరుగుతుండగా..తాజాగా ఈరోజు నాంపల్లి కోర్టు సురేఖ కు సమన్లు జారీ చేసింది. కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు జరిగే విచారణకు మంత్రి హాజరు కావాలని ఆదేశించింది.
Read Also : Delhi : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు