Site icon HashtagU Telugu

Nama Nageswara Rao: బీజేపీలోకి ఎంపీ నామా?`వాషింగ్ పౌడ‌ర్ నిర్మా` ఆప‌రేష‌న్!

Khammam

Nama Bjp Tdp

స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌డం ప్ర‌స్తుతం లీడ‌ర్లకు వెన్న‌తో పెట్టిన విద్య‌. అంతేకాదు, గాలి వాటం పాలిటిక్స్ వైపు దూకుడుగా వెళుతోన్న ప‌రిస్థితుల‌ను తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీని క‌నిపెట్టుకుని ఉన్న లీడ‌ర్లు టీఆర్ఎస్ పంచ‌కు చేరిపోయారు. ఇప్పుడు వాళ్లంద‌రూ దాదాపుగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ జాబితాలో తాజా ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు పేరు వినిపిస్తోంది.

పార్టీ ప్ర‌స్తుతం నామా నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం ఎంపీ. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. స్వ‌త‌హాగా పారిశ్రామిక‌వేత్త అయిన నామా తొలుత టీడీపీ నుంచి రాజ‌కీయ ప్ర‌స్తానాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ పార్టీ త‌ర‌పున 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఖ‌మ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజ‌య్, నామా, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మ‌నేలా అంత‌ర్గ‌త వార్ జ‌రుగుతోంది. వాళ్లంద‌రూ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.

Also Read:   Komatireddy Venkat Reddy: మునుగోడులో ఎస్పీలు ఉండగా, నాలాంటి హోంగార్డులు ఎందుకు!

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు మీద ప్ర‌స్తుతం ఈడీ దాడులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల‌ను సీజ్ కూడా చేశారు. సుమారు 83.5కోట్ల విలువైన వాటిని జ‌ప్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఈడీ విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఆయ‌న‌కు సంబంధించిన స్థిర‌, చ‌ర ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను సీజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సోమ‌వారం ఉద‌యం నుంచి నామా ఆస్తుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఈడీ సేకరిస్తోంది.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఆస్తుల‌పై గ‌తంలో ఈడీ దాడులు చేసింది. ఐడీ, ఈడీ దాడులు అప్ప‌ట్లో జ‌ర‌గ‌డంతో శ్రీనివాస‌రెడ్డి బీజేపీకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. పైగా శ్రీనివాస‌రెడ్డి కుమార్తె పెళ్లిక ప్ర‌త్యేకంగా బీజేపీ నేత ఈటెల‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆయ‌న ఉన్న‌ప్ప‌టికీ కుమార్తె వివాహ‌మ‌హోత్స‌వంలో బీజేపీ లీడ‌ర్ల హ‌వా క‌నిపించింది. దీంతో బీజేపీలోకి ఆయ‌న వెళుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించింది. అంతేకాదు, ఈడీ, ఐటీ దాడుల హ‌డావుడి కూడా ఆయ‌న మీద ఆస్తుల మీద త‌గ్గింది.

Also Read:   TTDP Politics: కేసీఆర్ కు చంద్రబాబు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేనా!

ప్ర‌స్తుతం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ప‌రిస్థితి కూడా పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి త‌ర‌హాలోనే ఉంటుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ సీఎం చెప్పిన `వాషింగ్ పౌడ‌ర్ నిర్మా` సూత్రాన్ని నామా మీద బీజేపీ ప్ర‌యోగించే అవ‌కాశం ఉంది. పైగా టీడీపీ, బీజేపీ ద‌గ్గ‌ర‌వుతోన్న వేళ తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయ ఈక్వేష‌న్లు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా టీడీపీ మ‌ద్ధ‌తును రాజ‌గోపాల్ రెడ్డి తీసుకున్నార‌ని తెలుస్తోంది. అందుకే, చివ‌రి నిమిషంలో టీడీపీ అభ్య‌ర్థిని నిల‌ప‌కుండా వెన‌క్కు త‌గ్గింద‌ని స‌మాచారం.

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు నామా నాగేశ్వ‌ర‌రావు. ప్ర‌తికూల రాజ‌కీయ వాతావ‌ర‌ణం న‌డుమ టీఆర్ఎస్ కు నామా వెళ్లారు. మ‌ళ్లీ తెలంగాణ వ్యాప్తంగా టీడీపీని బ‌ల‌ప‌ర‌చాల‌ని రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు సీరియ‌స్ మీటింగ్ పెట్టారు. దీంతో వివిధ పార్టీల్లోని పూర్వ‌పు లీడ‌ర్లు చంద్ర‌బాబు ఆహ్వానం కోసం చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొన్ని చోట్ల టీడీపీ నేరుగా అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌నుంది. మ‌రికొన్ని చోట్ల బీజేపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా అవ‌గాహ‌న ప్ర‌స్తుతానికి ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో పొత్తు ఖ‌రారు అయితే, తెలంగాణ‌లోనూ ఆ రెండు పార్టీ పొత్తు ఉంటుంద‌ని వినికిడి. అదే జ‌రిగితే, నామా తిరిగి టీడీపీ లేదా బీజేపీ గూటికి చేరే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read:   Munugode : మునుగోడు బీజేపీ ప్ర‌చారంలోకి మాజీ ఎంపీ బూర‌