Nagole Public Nuisance: మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్.. వీడియో వైర‌ల్..!

హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంట‌ని అడిగిన వారితో యువతీ యువకుడు గొడ‌వ పెట్టుకున్న విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 07:29 AM IST

Nagole Public Nuisance: హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంట‌ని అడిగిన వారితో యువతీ యువకుడు గొడ‌వ పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ (Nagole Public Nuisance)ను యువతి ఇష్ట‌మొచ్చిన‌ట్లు బూతులు తిట్టింది. హైదరాబాద్‌ – నాగోల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు న‌డిరోడ్డుపై మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. దీంతో ఆ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అంతేకాకుండా మార్నింగ్ వాక‌ర్స్ నాగోల్ పోలీసుల‌కు ఈ విష‌య‌మై ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. మందు, సిగరెట్ తాగుతూ మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన అలెక్స్ బొడి చేర్ల(25), అతనితో ఉన్న అమ్మాయిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వారిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Also Read: Water: ఉదయం నిద్రలేవగానే నీరు తాగుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా

నడిరోడ్డుపై యువతి రచ్చ ర‌చ్చ‌

అయితే ఈ జంట ఉప‌యోగించిన కారు కూడా వీళ్ల‌ది కాద‌ని తెలుస్తోంది. ఆ కారు రాధిక అనే మ‌హిళ పేరు మీద రిజిస్ట్రేష‌న్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ కారుపై 5 చ‌లాన్లు కూడా చెల్లించాల్సి ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే గొడ‌వ స‌మ‌యంలో వీడియో తీస్తున్న వ్య‌క్తుల‌పై కూడా యువ‌తీ రెచ్చిపోయింది. అసలు నువ్వు ఎవ‌ర్రా..? నా వీడియో ఎందుకు తీస్తున్నావు రా..! నీకుంది నా చేతిలో లాంటి ప‌దాలు వాడింది.

We’re now on WhatsApp : Click to Join

యువ‌తి ర‌చ్చ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో తీస్తున్న స‌మ‌యంలో మ‌హిళ ఒక చేతిలో బీర్ బాటిల్‌, మ‌రో చేతిలో సిగ‌రెట్ తాగుతూ క‌నిపించింది. అయితే అక్క‌డికి పోలీసులు వ‌చ్చే స‌మ‌యానికి ఈ జంట పారిపోయింది. వీరిద్ద‌రూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని స‌మాచారం. తెల్ల‌వారుజామున 4 గంట‌ల వ‌ర‌కు విధులు నిర్వ‌హించి ఆ త‌ర్వాత ఇలా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది.