Legal notices : మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సురేఖ ప్రకటించారు. అయితే ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడేలా లేదు. మంత్రి మంటలపై నాగార్జున వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడిన సురేఖకు త్వరలో నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: Ram Gopal Varma: సీఎం రేవంత్‌కు రామ్ గోపాల్ వర్మ స్పెషల్ రిక్వెస్ట్
ఇప్పటికే తనపై చేసిన కామెంట్లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సురేఖకు లీగన్ నోటీలు పంపిన విషయం తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారురు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టప్రకా రం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశానని, నాగచైతన్య-సమంత విడిపోవడానికి ప్రధాన కారణం తానేనని, కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంగానే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో పేరొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని తెలిపారు.
సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడటం దురదృష్టకరం అని వెల్లడించారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని అన్నారు. ఎలాం టి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉన్నదని చెప్పారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా సురేఖ మా ట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన సురేఖకు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.