Nagarjuna statement : టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, సినిమా రంగం ద్వారా దేశ వ్యాప్తంగా తమ కుటుంబానికి ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
నాంపల్లి కోర్టుకు చేరుకున్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అమల. #nagarjun #KondaSurekha #tollywood #HashtagU pic.twitter.com/qXDCoHlY8a
— Hashtag U (@HashtaguIn) October 8, 2024
తన కొడుకు నాగ చైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు.
Read Also: Vinesh Phogat : ఇది ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి..మహిళ యొక్క పోరాటం: వినేష్
పిటిషన్ ఫైల్ చేయడానికి కారణం, ఉద్దేశం ఏంటని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని.. దాంతో తమ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులుపై మంత్రి కొండా సురేఖ అనుచిత వాఖ్యలు చేశారని.. ఆమె చర్యలకు ఆదేశించాలని కోర్టును నాగార్జున కోరారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లు నాగార్జున తెలిపారు.