Site icon HashtagU Telugu

Nagarjuna : ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో నాగార్జున పిటిషన్‌.. మధ్యంతర ఉత్తర్వులు

Nagarjuna petition in the High Court on the demolition of the N Convention

Nagarjuna petition in the High Court on the demolition of the N Convention

Akkineni Nagarjuna: హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్(n convention) కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, అంతకు ముందు ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని నాగార్జున అన్నారు.

ఇక, ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు అని నాగార్జున తెలిపారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది అన్నారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని.. తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని అక్కినేని నాగార్జున వెల్లడించారు.

Read Also: Deepika Padukone : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే..?