Site icon HashtagU Telugu

Nagarjuna : తెలంగాణలో మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశాలు చూడాలసిందే అంటున్న నాగ్

Nag Top Sights In Telangana

Nag Top Sights In Telangana

తెలంగాణ(Telangana) లోని పర్యాటక ప్రదేశాలు , టెంపుల్స్ , వంటకాలు తదితర విషయాలను ఎంతో గొప్పగా చెప్పి నాగార్జున (Nagarjuna) తెలంగాణ ప్రజలనే కాదు పర్యాటకులను సైతం ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తన ప్రేమను , అభిమానాన్ని వ్యక్తం చేసారు. చిన్నప్పటి నుంచే తెలంగాణలో తిరుగుతూ వచ్చానని, తెలంగాణ ప్రదేశాల అందచందాలు, వాటి ప్రత్యేకతలను ఆయన ప్రశంసించారు. తెలంగాణ అందాలను గురించి చెప్పేటప్పుడు జోడేఘాట్ వాలీ, మిట్టె వాటర్ ఫాల్స్ (ఆదిలాబాద్), బొగత వాటర్ ఫాల్స్ వంటి ప్రకృతి సౌందర్యాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Kai Trump: డొనాల్డ్ ట్రంప్ మనవరాలి వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?

అలాగే తెలంగాణలోని దేవాలయాల ప్రసిద్ధి గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, రామప్ప టెంపుల్ వంటి ఆర్కిటెక్చర్ అత్యద్భుతాలకు ఆయన ముగ్దయినట్లు పేర్కొన్నారు. రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడం ఆయన గర్వంగా చెప్పుకున్నారు. యాదగిరి గుట్ట వంటి పవిత్ర స్థలాలు భక్తులను ఆహ్వానిస్తాయన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తపరిచారు.

Tirupati Stampede: తిరుప‌తిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?

తెలంగాణ వంటకాలు నాగార్జునకు ఎంతో ఇష్టమైనవని, వాటి ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. జొన్న రొట్టె, అంకాపూర్ చికెన్, సర్వపిండి వంటి స్థానిక వంటకాల నుంచి హైదరాబాద్ బిర్యానీ, కరాచీ బేకర్స్, ఇరాన్ ఛాయ్ వంటి ఇష్టమైన వాటి గురించి ఆయన ప్రస్తావించారు. ఇక తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతూ.. వారి ప్రేమ, ఆతిథ్యం, భాష ఎంతగానో ఆకట్టుకుందన్నారు. వారి స్నేహసంబంధాలను గొప్పవిగా వర్ణించిన నాగార్జున, తెలంగాణ ప్రజల జీవన విధానం అందరినీ ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. వారి జీవనశైలిలోని అనునయత, సాంప్రదాయాలు ఆయనకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయన్నారు. తెలంగాణ అందాల నుండి సాంస్కృతిక సంపద వరకు, నాగార్జున తన అనుభవాలను తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల ఆయన అభిమానం, రాష్ట్రానికి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల ప్రేమను కూడా చాటుతుంది. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆయన తపన అందరికి స్పూర్తిగా నిలుస్తోంది.

తెలంగాణ యొక్క వైభవాన్ని, సంపన్న సాంస్కృతిక మూలాలను, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలను అభివర్ణిస్తూ నాగార్జున ఇచ్చిన సందేశం మన రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా ఉందంటూ నాగార్జున కు తెలంగాణ టూరిజం థాంక్స్ తెలిపింది.