Site icon HashtagU Telugu

BRS Party: కాంగ్రెస్ కు గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్ధన్, విష్ణువర్ధన్ రెడ్డి

Nagam And Pjr

Nagam And Pjr

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల ముందు, కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు అభ్యర్థుల జాబితాలలో టిక్కెట్లు నిరాకరించబడిన కొందరు అసంతృప్త నాయకులు మంగళవారం తమ అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరారు. ఈ జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్త కొత్త జైపాల్ రెడ్డి ఉన్నారు.

రాజకీయ భవిష్యత్తు బాధ్యత తీసుకున్న పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ తనకు నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంపై నాగం జనార్దన్ మనస్తాపం చెందగా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టిక్కెట్ ఇవ్వడంపై విష్ణు వర్ధన్ అసంతృప్తిగా ఉన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగం జనార్దన్ రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఉద్యమం లో పాల్గొన్నారు. జైలుకు వెళ్లిన చరిత్ర నాగంది. నాగం చేరికతో బీఆర్ఎస్ బలం పెరిగింది. పాలమూరు లో పద్నాలుగుకు పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయం అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ కు నాది భాద్యత అని, పీజేఆర్ నాకు మంచి మిత్రుడు ..ఆయన కుమారుడు  విష్ణు  నా కుటుంబ సభ్యుడి లాంటి వాడే కేసీఆర్ అన్నారు.

Also Read: Data Leak: దేశ చరిత్రలో డేటా లీక్ కలకలం, అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్

Exit mobile version