Site icon HashtagU Telugu

Nagarjuna : ‘బిగ్‌బాస్’ నుంచి నాగార్జునను తప్పించండి.. హేతువాది బాబు గోగినేని సంచలన ట్వీట్

Babu Gogineni Nagarjuna Bigg Boss

Nagarjuna : బిగ్‌బాస్ షో అనగానే మొదట గుర్తుకొచ్చేది హీరో నాగార్జున. అటువంటి నాగార్జునపై ప్రముఖ హేతువాది, బిగ్‌బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ సీజన్ 8 షో నుంచి నాగార్జున‌ను తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి ఎన్ క‌న్వెన్ష‌న్‌ను నిర్మించార‌నే అభియోగాలను నాగార్జున ఎదుర్కొంటున్నందున నాగార్జునను షో నుంచి తప్పించడమే మంచిదని బాబు గోగినేని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఒకవేళ నాగార్జునను(Nagarjuna) బిగ్‌బాస్ షో నిర్వాహకులు తొలగించకుంటే.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని కోరారు.  ‘‘ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్ ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. బిగ్‌బాస్ 8 షో సెప్టెంబ‌ర్ 1 నుంచి మొదలుకానుంది. దీనికి  నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు. ఇటీవ‌లే ఈ సీజ‌న్‌కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

తనకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌పై నాగార్జున కోర్టును ఆశ్ర‌యించారు. ‘‘ఎన్ క‌న్వెన్ష‌న్‌ను మేం నిర్మించిన భూమి క‌బ్జా చేసింది కాదు. అది ప‌ట్టా భూమి. మేం ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేత జరిగింది. కూల్చివేసే ముందు కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు’’ అని పేర్కొంటూ నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read :KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఈ వివాదం నేపథ్యంలో నాగార్జున బిగ్‌బాస్‌ షోలో హోస్ట్‌గా కొన‌సాగుతారా ? లేదంటే మ‌రో కొత్త హోస్ట్ వ‌స్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక‌వేళ నాగార్జున త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే హోస్ట్‌గా ఎవ‌రు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి బిగ్‌బాస్ సీజ‌న్‌లో కంటెస్టెంట్స్‌గా చక్రవాకం సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్, మరో సీరియ‌ల్ హీరో నిఖిల్ మలిక్కల్ పాల్గొంటారని తెలుస్తోంది. హీరో అభిరామ్ వర్మ, సింగర్ సాకేత్ కొమండూరి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read :Harish Rao : హైడ్రాతో రాజకీయ హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ : హరీష్‌రావు