భారతదేశం (India) అంత కూడా ఒకే సమయానికి సూర్యడు (SUN) ఉదయించడం, సూర్యుడు అస్థమించడం జరుగుతుంది. కానీ తెలంగాణ (Telangana) లోని ఓ గ్రామంలో మాత్రం వేరు..ఉదయించేది ఆలస్యం..అస్తమించడం మాత్రం ముందే..చుట్టూ కొండలు , పట్టపొలాలు మధ్య ఆ గ్రామం ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ సాయంత్రం 4 అయ్యేసరికి అంత చీకటి అవుతుంది. ఆ గ్రామానికి నాలుగు వైపుల కూడా కొండలు ఉంటాయి. తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్ట ఉంటుంది. చుట్టు నాలుగు వైపుల గుట్టలు ఉండటం ఈ ఊరిని ప్రత్యేకంగా మార్చేసింది. ఈ గ్రామ ప్రజలు ప్రపంచం కంటే ఆలస్యంగా సూర్యోదయంను చూడటంతో పాటు, ఈ ఊరి ప్రజలు సూర్యస్థమయం చూసిన తర్వాత ఇతర ప్రపంచం చూస్తుంది. అంత ప్రత్యేకం. ఇంతకీ ఆ గ్రామం పేరు ఏంటి..? ఎక్కడ ఉంది..? ఎందుకు త్వరగా చీకటి పడుతుంది..? అనేది తెలుసుకుందాం.
‘మూడు జముల కొదురుపాక ‘
పెద్దపల్లి(Peddapalli) జిల్లా సుల్తానాబాద్(sultanabad) మండలంలోని కొదురుపాక(Kodurupaka). శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ గ్రామంపై సూర్యుడి కనికరం చాలా తక్కువ. పచ్చదనంతో అలరారే ఆ గ్రామాన్ని రెండు మూడు గంటల ఆలస్యంగా తట్టిలేపే సూర్యుడు(Sun).. మూడు గంటల ముందుగానే బై చెప్పి వెళ్లిపోతాడు. అన్ని గ్రామాలు నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తే.. సూర్యుడి శీతకన్నుతో కొదురుపాక గ్రామస్తులు మాత్రం మూడు జాములతోనే కాలం వెల్లదీస్తున్నారు. అందుకే ఈ గ్రామాన్ని ‘మూడు జముల కొదురుపాక ‘ అని కూడా అంటారు. గ్రామం చుట్టూ ఉన్న గుట్టల కారణంగా కొదురుపాకలో సూర్యోదయం ఆలస్యంగా జరగడం, సూర్యాస్తమయం తొందరగా జరిగిపోతుంది. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
నాల్గు గంటల వరకు అంత ఇంటికి రావాల్సిందే
తూర్పున ఉన్న గొల్లగుట్ట కారణంగా ఆ గ్రామానికి సూర్యోదయం దాదాపు 7.30 నిమిషాలకు మొదలవుతుంది. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది. ఇక సాయంత్రం సమయంలో పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట చాటుకు సూర్యడు వెళ్లి పోవడంతో నాల్గు గంటలకే అక్కడ చీకటి వాతావరణం ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో అక్కడ చీకటిగా ఉండటంతో అక్కడి ప్రజలు త్వరగా పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తుంటారు. శతాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో ఈ గ్రామ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. రంగనాయకుల గుట్టను ఆనుకుని ఉన్న ప్రాంతం వారికి మరీ ఇబ్బంది ఎక్కువ ఉండటంతో అక్కడ నివసించే చాలామంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారట. కొదురుపాక గ్రామానికి కొత్తగా వచ్చే వారు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతుంటారు. సాయంత్రం వేళల్లో కొదురుపాకకు చేరుకునే వారిలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు.
దేవుడి విగ్రహం లేని గుడి ఇక్కడే ..
కొదురుపాక (Kodurupaka Village) గ్రామానికి మరో ప్రత్యేక కూడా ఉంది. రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండడు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ ఆలయంలో దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండగ సందర్భంగా జరిగే వేడుకకు మాత్రం దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. గ్రామస్థులు రథయాత్రతో స్వామిని తీసుకొచ్చి ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునిపల్లికి చేరవేస్తారు. విజయదశమి నాడు గ్రామస్థులు అంగరంగ వైభవంగా నంబులాద్రి స్వామికి పూజలు నిర్వహించి, వేడుకలు జరపడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఏంటి ఇదంతా వింతగా అనిపిస్తుంది కదా..కుదిరితే మీరు కూడా ఓసారి ఈ గ్రామానికి వెళ్లి ఎంజాయ్ చెయ్యండి.
Read Also : Cumin Tea Benefits: మీరు రోజు జీలకర్ర టీ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా..?