MLA Rohit Watch Cost : మెదక్ ఎమ్మెల్యే చాల ‘రిచ్’..రూ.3 కోట్ల ‘వాచ్’ వాడుతున్నాడు

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 07:47 PM IST

సాధారణంగా సినీ ప్రముఖులే ఖరీదైన వాచ్ లను , కార్లను మెంటైన్ చేస్తుంటారని చాలామంది అనుకుంటారు..కానీ రాజకీయ నేతలు సైతం సినీ ప్రముఖులను మించి మెంటైన్ చేస్తుంటారు..కాకపోతే ఇవి బయటకు ఎక్కువగా ఫోకస్ చేయరు. రాష్ట్రంలో తిరిగినప్పుడు సాధారణంగా కనిపిస్తుంటారు..అదే విదేశాలకు వెళ్లే టప్పుడు ఓ రేంజ్ లో ఖరీదైన వాచ్ లను , డ్రెస్ లను మెంటైన్ చేస్తుంటారు. తాజాగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు సంబదించిన చేతి వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏదో అలాటప్ప..వెయ్యో..లక్షో రూపాయిల వాచ్ కాదు ఈయన మెంటైన్ చేసింది ఏకంగా మూడు కోట్లా వాచ్ ను మెంటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ‘రిచర్డ్ మిల్లె’ కంపెనీకి చెందిన వాచ్‌ను రోహిత్ వాడుతున్నాడు. దీని ఖరీదు అక్షరాల రూ. 3 కోట్లు ఉంటుంది. ప్రస్తతం దీనికి సంబదించిన వీడియో వైరల్ గా కావడం తో వాచ్ ఖరీదు చూసి వామ్మో అనుకుంటున్నారు.. అయినా డబ్బు ఉండాలే కాని.. మూడు కోట్లు ఏంటి ముప్పై కోట్ల వాచ్ అయినా పెట్టుకోవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదేకాదు రోహిత్ సచివాలయానికి కూడా ఫారిన్ కార్లలో వస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆ మధ్య ఈ వీడియోస్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి.

మైనంపల్లి హన్మంతరావు అండతో రోహిత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు రాజకీయరంగ ప్రవేశం చేసిన మైనంపల్లి రోహిత్ మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచి రికార్డు నెలకొల్పాడు. ఎందుకంటే మెదక్ చరిత్ర లో 26 ఏళ్ల వయసు ఉన్న ఏ నేత కూడా ఎమ్మెల్యే గా గెలిచినా దాఖలు లేవు..అలాంటిది రోహిత్ ఫస్ట్ ట్రై లోనే గెలిచి వార్తల్లో నిలిచారు. వాస్తవానికి ఈ స్థానం నుండి ముందుగా బిఆర్ఎస్ నుండి పోటీ చేయాలనీ భావించాడు..కానీ బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం తో తండ్రి తో పాటు ఆయన బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరి విజయం సాధించాడు.

Read Also : CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక