Mynampally : బాంబ్ పేల్చిన మైనంపల్లి..

Mynampally : తమతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ గేట్లెత్తితే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరని కీలక వ్యాఖ్యలు చేసారు

Published By: HashtagU Telugu Desk
Mynampally Hanumanth Rao

Mynampally Hanumanth Rao

Mynampally Hanumantha Rao Sensational Comments : తమతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పెద్ద బాంబ్ పేల్చాడు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao). అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా చాలామంది బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కేవలం ఓడిన నేతలే కాదు..బిఆర్ఎస్ నుండి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ (KCR) కు షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా వలసల పర్వం ఆగడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మైనంపల్లి హన్మంతరావు బాంబ్ పేల్చాడు. తమతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ గేట్లెత్తితే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరని కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారనీ రెండు మంత్రి పదవులు ఇస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోకి వస్తానన్నారని హన్మంతరావు అన్నారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..అనవసరంగా తమను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండనీ హెచ్చరించారు. కేటీఆర్,హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి వాళ్లే తమ టార్గెట్ అని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాళ్లవి క్రిమినల్ మైండ్లు అని, విద్యుత్ అధికారులు కొందరు వాళ్లకి సహకరిస్తూ రైతులకు కరెంటు కోతలు విధిస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. కానీ గాంధీ మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా నాడు బీఆర్ఎస్‌లో చేరారన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగాయని, ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

Read Also : Youtuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయి పై పోలీసులకు పిర్యాదు చేసిన యువతీ

  Last Updated: 24 Sep 2024, 08:33 PM IST