Phone Tapping : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తమిళిసై ఒకరు

తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆమె ఆరోపించారు

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 04:21 PM IST

తెలంగాణ (Telangana) లో గత ప్రభుత్వ (BRS) హయాంలో పెద్ద ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందనేది సత్యం. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసి కీలక ఆధారాలు రాబోతున్నారు. ఈ వ్యహారం రోజు రోజుకు పెరిగిపోతుండటం తో ఫోన్ ట్యాపింగ్ బాధితులంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని వాపోతుండగా..ఈ బాధితుల్లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై (Ex Governor Tamilisai) కూడా ఉన్నట్లు స్వయంగా ఆమెనే తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆమె ఆరోపించారు. దీనిపై 2022 లోనే తాను స్పందించనని గుర్తు చేసారు. కానీ ఆ సమయంలో నేను రాజకీయాలు చేస్తున్నాన్నట్లు ప్రభుత్వం తన ఆరోపణలను తోసిపుచ్చింది. గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని.. తమిళిసై ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి..బిజెపి పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యి..బిజెపి సౌత్ చెన్నై నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Read Also : Saree Draper : చీరకట్టును బిజినెస్‌గా మార్చేసి.. అంబానీలను క్లయింట్లుగా చేసేసి..