సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. రాత్రి వేళల్లో దేవాలయాల్లోకి చొరబడి..విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కుమ్మరిగూడ లోను అలాగే జరిగింది. అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వసం చేసారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు , రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని, శ్రీగణేశ్ చేరుకొని పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తాజాగా బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ (Etela Rajender) సైతం ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు. మరోపక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ ఘటన పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. డీజేలపై నిషేధం విధించిన పోలీసులు.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గమ్మ నవరాత్రుల పూజ సందర్భంగా చాలా రకాల ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Boeing : బోయింగ్ కీలక నిర్ణయం..17 వేల మంది ఉద్యోగులపై వేటు