ఇటీవల వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని భక్తులు మొరపెట్టుకుంటున్నప్పటికీ..వరుస దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడితో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అర్థరాత్రి దుండగులు ఆలయంలోని స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని, శ్రీగణేశ్ ఆలయం వద్దకు చేరుకొని, పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైందని ఉదాయన్నే తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెబుతున్నారు.
విగ్రహం ధ్వంసమైన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సీరియస్ అయ్యారు. ఆలయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. గుడిలోపలికి వెళ్లి వివరాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని పేర్కొన్నారు.
Read Also : Nara Rohit : నారా రోహిత్ తన ప్రేమ విషయం ముందుగా ఎవరికీ చెప్పాడు..?