TSRTC Chairman: టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా జనగాం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈరోజు బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఆర్‌టిసి ఎండీ సజ్జనార్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఇప్పటి వరకు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కొనసాగారు. ఇప్పుడు ఆయన స్థానంలో ముత్తిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ముత్తిరెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించని కారణంగా సీఎం కేసీఆర్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నారు అందరు . కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ సారధ్యంతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని కొనియాడారు. కాగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని . ఉద్యోగులతో సమన్వయంగా కలిసి పని చేస్తాను. సంస్థను నంబర్ వన్‌గా నిలుపుతాను ఆయన చెప్పారు.
Also Read: Congress Bus Yatra : తెలంగాణ లో రాహుల్ బస్సు యాత్ర..