ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. అయోధ్య లో అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరై..వేడుకను చూసారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా రామస్మరణతో మారుమోగిపోయింది. అన్ని రామాయలల్లో ఉదయం నుండే భక్తుల తాకిడి నెలకొంది. అనేక చోట్లా ప్రాణ ప్రతిష్ట ప్రత్యేక్ష ప్రసారాలు అందజేసి ప్రజలను భక్తిలో మునిగేలా చేసారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో సాయంత్రం వేళ దీపాలు వెలిగించి రామ భక్తిని చాటుకున్నారు. ఇక అయోధ్యలో సరయు నదీ తీరాన దీపోత్సవం నిర్వహించారు. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో మతసామరస్యం వెల్లివిరిసింది. అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లొ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం నేత హిందువులకు సంతోషంతో స్వీట్లు పంచారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనలో స్వీట్లు పంచిన ముస్లిం యువకుడు
అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లొ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం నేత హిందువులకు సంతోషంతో స్వీట్లు పంచారు. pic.twitter.com/aEGEfxZ7Y0
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024
Read Also : CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య