Bodhan Fake Voters: బోధన్ లో భారీగా నకిలీ ఓటర్లు: ధర్మపురి

మహారాష్ట్ర ఓట్లు తెలంగాణాలో భారీగా నమోదవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారికి లేఖ రాశారు

Bodhan Fake Voters: మహారాష్ట్ర ఓట్లు తెలంగాణాలో భారీగా నమోదవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారికి లేఖ రాశారు. ఈ రోజు సెప్టెంబర్ 15 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాలు చూస్తే.. జూలై 20 నుండి సెప్టెంబర్ 5 వరకు ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో సుమారు 4024 కొత్త ఓటరు దరఖాస్తులు వచ్చాయని, వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన ముస్లింలేనని ధర్మపురి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఓటరు నమోదు కోసం నకిలీ దరఖాస్తులను అధికారులు గుర్తించారని. కొన్ని అబద్దపు చిరునామాతో ఉన్నట్లు గుర్తించామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

2019లో బోధన్ నుంచి కాంగ్రెస్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి పొద్దుటూరిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ మహ్మద్ గెలిచారు. బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోసం ఇప్పటి వరకు 11,402 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ముస్లిం ఓట్లున్నాయి. అవన్నీ దొంగ ఓట్లేనని ధర్మపురి మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన ముస్లింలను బోధన్‌కు తీసుకువచ్చి నమోదు చేసుకున్నారని, ఇప్పటికే వారిని డ్రాఫ్ట్ లిస్ట్‌లో చూపించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా ఈఆర్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయలేకపోతున్నారని అన్నాడు. నకిలీ ఓటర్లను తొలగించేందుకు డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ నిర్వహించాలని ఈఆర్‌వోను అభ్యర్థించామని, అయితే బూత్‌ లెవల్‌ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే ఒత్తిడితో అలాంటి నకిలీ ఓటర్లను తొలగించలేకపోతున్నారని తెలిపారు.

Also Read: Ganesh Chaturthi 2023: మంత్రి జగదీశ్‌రెడ్డి 3 వేల మట్టి విగ్రహాల పంపిణి