Site icon HashtagU Telugu

Ganesh Laddu: వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ

Ganesh Laddu

Ganesh Laddu

Ganesh Laddu: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలో మతసామరస్యం అద్భుతంగా వెల్లివిరిసింది. హిందూ సాంప్రదాయ పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ ఉత్సాహంగా పాల్గొని, చివరికి లడ్డూను విజయవంతంగా దక్కించుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ గణేష్ లడ్డూ వేలంలో పోటీ గట్టిగానే జరిగింది. అనేక మంది భక్తులు లడ్డూను పొందేందుకు ముందుకు వచ్చినప్పటికీ, చివరికి అమ్రీన్ పెట్టిన రూ.1,88,888 భారీ బిడ్‌ను ఎవ్వరూ అధిగమించలేకపోయారు. దీంతో లడ్డూ ఆమె సొంతమైంది.

Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

ఒక ముస్లిం మహిళ హిందూ పండుగలో ఇంత ఉత్సాహంగా పాల్గొని, లడ్డూను స్వంతం చేసుకోవడం స్థానికులందరినీ ఆకట్టుకుంది. మతభేదాలు పక్కనపెట్టి సమాజంలో సఖ్యత పెంపొందించడంలో ఇది గొప్ప ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమ్రీన్ మాట్లాడుతూ – “ఈ లడ్డూను దక్కించుకోవడం నాకు గర్వంగా ఉంది. సమాజంలో మతసౌహార్దం, ఐక్యత పెంపొందాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు.

మరోవైపు నారాయణపేట జిల్లా ముష్టిపల్లిలో కూడా ఇలాంటి విశేషం చోటుచేసుకుంది. అక్కడ గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం యువకుడు ఎండీ పాషా పాల్గొని, రూ.26,116కి లడ్డూను దక్కించుకున్నారు. స్థానికులు ఆయనను అభినందించారు. నిర్మల్, నారాయణపేటల్లో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు తెలంగాణలో మతసామరస్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. మతపరమైన వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనడం, ఐక్యతా భావనను మరింత బలపరుస్తుందని అన్నారు.

MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!