మూసి బాధితుల (Musi Victims) ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. మూసీ (Musi) ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజులపాటు మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి అక్రమ ఇళ్లను గుర్తించారు. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టారు.
రెండు రోజులుగా మూసి పరివాహక వాసులంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. నిన్న ఆదివారం కూడా ఎంతోమంది బాధితులు రోడ్ల పైకి వచ్చారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసి బాధితులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో మూసీ బాధితులకు మద్దతుగా.. సీపీఎం నేతలు పాల్గొన్నారు. “మా ఇల్లు ఇక్కడే మా జీవితాలు ఇక్కడే” అంటూ ప్లకార్డులు పట్టుకొని కలెక్టర్ కార్యాలయం గేటు మందు బైఠాయించారు.
ప్రజలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోందని, కానీ తమను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదని, తమను తామే కాపాడుకుంటామని చెబుతున్నారు. అంతేగాక తాము ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, తమకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also : Supreme Court : ఇళ్ల కూల్చివేతలు..అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు