మూసీ నది (Musi ) ప్రక్షాళనను పేరుతో కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt)..మూసీ నిర్వాసితులను ఖాళీ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. మూసీ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు. పునరావాసం కోసం పేదల వివరాల సేకరించే పనిలో భాగంగా అధికారులు మూసి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లారు.
పునరావాసం తర్వాతే ఇళ్ళు కూలుస్తామని… అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే అసలు మూసీ నదిలో బఫర్‌జోన్ ఎక్కడి వరకు ఉందనేది అధికారులు చెప్పడం లేదని.. జస్ట్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మార్క్ వేసుకుంటూ వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అసలు ఎన్ని రోజుల్లో ఖాళీ చేయాలి..? ఎంత టైం ఇస్తున్నారు..? మా ఇళ్లకు నోటీసులు ఇవే..? నోటీసుల్లో కాస్త టైం ఇస్తారు కదా..? అని ప్రశ్నిస్తే వాటికీ ఇలాంటి సమాదానాలు చెప్పకుండా అధికారులు దాటవేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఏది ఏమైనప్పటికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం..దాన్ని సరైన రీతిలో ఆచరణ చేయడం లేదనేది వాస్తవం. మొదట ప్రభుత్వ స్థలంలో , చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని మాత్రమే కూలుస్తామని..రాజకీయ నేతల ఫామ్ హౌస్ లపైనే దృష్టి అని..వాటి తర్వాతే మిగతావి అని హైడ్రా ముందుగా తెలిపింది. ఆ తర్వాత రాజకీయ నేతల ఫామ్ హౌస్ లు వదిలిపెట్టారు. చెరువులు కబ్జా చేసి విల్లాలు , బిల్డింగ్స్ కట్టిన బిల్డర్స్ ను వదిలిపెట్టి..సామాన్య ప్రజల ఫై ప్రతాపం చూపిస్తున్నారు. అంతే కాదు సంపన్నులు , రాజకీయ నేతల ఇళ్లకు నెల రోజుల టైం ఇస్తున్నారు..సామాన్య ప్రజల ఇంటి దగ్గరికి వచ్చేసరికి బుల్లడోజర్స్ రంగంలోకి దింపుతూ..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకుంటామన్న కూడా జాలి చూపించకుండా కూల్చేస్తు..కట్టుబట్టలతో నడి రోడ్ మీద నిల్చుబెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే..అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త హైడ్రా దూకుడు తగ్గించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సర్కార్ మంచిది..లేదంటే మధ్యంతర ఎన్నికలు రావడం పక్క..ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
Read Also : Dashboard Cameras: డాష్ కెమెరా అంటే ఏమిటి? కలిగే ప్రయోజనాలు ఏమిటి?