Site icon HashtagU Telugu

Kukatpally Girl Murder Mystery : బాలిక హత్య కేసు.. వీడిన మిస్టరీ

Kukatpally Girl Murder Myst

Kukatpally Girl Murder Myst

కూకట్‌పల్లిలో ఐదు రోజుల క్రితం జరిగిన 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ (Kukatpally Girl Murder Mystery) వీడింది. ఈ హత్యకు పాల్పడింది సహస్ర (Sahasra) ఇంటి పక్కనే ఉండే పదవ తరగతి చదువుతున్న బాలుడు అని పోలీసులు గుర్తించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు, సహస్ర చూడటంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రూ. 80 వేలు చోరీ చేసిన బాలుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను 21 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు విచారణలో తేలింది.

Telangana : తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్.. వివరాలివే..!

ఈ హత్య తర్వాత ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను బాలుడు ముందే ఓ పేపర్‌లో రాసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ‘ఎవరైనా చూస్తే ఏం చేయాలి’, ‘చోరీ ఎలా చేయాలి’ అని అందులో రాసి ఉన్నట్లు తెలిసింది. దొంగతనం చేసిన డబ్బును, కత్తిని, ఆ పేపర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల విచారణలో బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేసేందుకు వెళ్లినప్పుడు సహస్ర చూడటంతో ఆమెపై దాడి చేశానని, ఆ తర్వాత ఆమె మెడ కోసి, విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ సహస్ర బ్రతకకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశానని బాలుడు చెప్పడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.