Site icon HashtagU Telugu

Munugodu bypoll: మునుగోడు ‘కాంగ్రెస్’ అభ్యర్థిపై అంతటా ఉత్కంఠత

Tcongress

Tcongress

తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీకాంగ్రెస్ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మునుగోడు వ్యూహాలపై వరుసగా సమావేశాలవుతున్నారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగిస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సభ్యుల్లో ప్రచార కమిటీ పాల్వాయి స్రవంతి, చెలమల్ల కృష్ణా రెడ్డి అనే ఇద్దరి పేర్లను ఎంపిక చేసింది. నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యర్థిని బరిలోకి దించాలని పలువురు నేతలు నాయకత్వాన్ని కోరారు.

“కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో, మేం ఒక బిసి అభ్యర్థిని ఎంచుకున్నాం. దీంతో గెలుపుకు దారి తీసింది. మునుగోడుపై కూడా ఇదే విధమైన వ్యూహం ఉంది, అయితే ఈ ప్రభావంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు” అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకా, స్రవంతి, కృష్ణారెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపామని, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆ వర్గాలు తెలిపాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన స్రవంతి నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. రియల్టర్ అయిన కృష్ణా రెడ్డి టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికీ టికెట్ దక్కుతుందా? అని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.