Site icon HashtagU Telugu

Munugode Voters: డ‌బ్బిస్తేనే ఓటు! రోడ్లపై మ‌హిళా ఓట‌ర్లు!!

Munugode

Munugode

మునుగోడులో పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్దీ విచిత్ర సీన్లు క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఎప్పుడూ లేనివిధంగా ఓట‌ర్లు రోడ్ల మీద‌కు వ‌చ్చి డ‌బ్బు కోసం డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌ను డ‌బ్బు ఇవ్వాల‌ని వెంబ‌డిస్తున్నారు. పురుష ఓట‌ర్లకు ఫుల్ గా మ‌ద్యం పంపిణీ చేసిన స్థానిక లీడ‌ర్లు మ‌హిళా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి డ‌బ్బును పంచుతున్నారు. కానీ, కొన్ని చోట్ల డ‌బ్బు పంపిణీ లేక‌పోవ‌డంతో రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న తెలియ‌చేయ‌డం విచిత్రం.

ఓటు వేయడానికి డబ్బులు ఎందుకు పంపిణీ చేయలేదని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. అధికారిక నివేదిక‌ల ప్ర‌కారం కొరటికల్ గ్రామానికి చెందిన కొంద‌రు మహిళా ఓటర్లు డబ్బు ఎందుకు పంపిణీ చేయలేదని ఒక రాజకీయ పార్టీ నాయకుడిని నిల‌దీయ‌డం మునుగోడులోని స‌రికొత్త పోక‌డ‌.

Also Read:  TRS MLA’s Quit Please: సార్ ప్లీజ్ రిజైన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలింగ్ అధికారులు గ్రామానికి చేరుకుని వీడియోలో ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు ఓటర్లకు పంచేందుకు ప్యాక్ చేసి ఉంచిన‌ ఓ దుకాణంలో చికెన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.10000 వరకు ప్రధాన రాజకీయ పార్టీలు పంపిణీ చేశాయని తెలుస్తోంది.

 

Exit mobile version