ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ మంత్రి మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచారం నిషేధం విధించింది. అలాగే ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకూడదని మంత్రిని నిషేధించారు.అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశించారు. ఐదు రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్నారు.
పింఛను రాకుంటే నరేంద్ర మోదీకి ఓటు వేయాలని ఓటర్లకు మంత్రి సూచించారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు కొనసాగాలంటే కేసీఆర్‌కు ఓటేయాలని కోరారు. దీనిపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ప్రసంగంపై ఈసీ శనివారం నోటీసులు జారీ చేసింది. మంత్రి జగదీశ్ సమర్పించిన వివరణతో సంతృప్తి చెందని ఈసీ.. ఆదివారం నుంచి రాత్రి 7 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.