Site icon HashtagU Telugu

KTR Tweet on Munugode: మునుగోడు ప్రజలారా ఎవరి పక్షమో తెల్చుకోండి.. కేటీఆర్ ట్వీట్!

Ktr

Ktr

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్  ఫిక్స్ అయిన వెంటనే, ప్రధాన పార్టీల నేతలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఇతర పార్టీలపై అస్త్రశస్త్రలు ప్రయోగించబోతున్నారు. ఉప ఎన్నికకు కేవలం నెలరోజులే సమయంలో ఉండటంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ‘ఎవరి పక్షం’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

”పూర్వపు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించనందుకు కాంగ్రెస్‌ను, ఫ్లోరోసిస్‌ను అంతం చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు నిరాకరించినందుకు ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తారా ?” అంటూ అంటూ ట్విట్టర్ వేదకగా రిక్వెస్ట్ చేశారు. మునుగోడులో ఏ పార్టీ గెలుపుకు అర్హులో మునుగోడు ప్రజలే నిర్ణయించాలని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మునుగోడు ప్రజలకు సరైన న్యాయం జరిగిందన్నారు.

మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఫ్లోరోసిస్‌ బారిన పడిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బాలుడిని పరీక్షిస్తున్న ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి జోక్యం చేసుకున్నా ఫ్లోరైడ్ పీడిత జిల్లాకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేటీఆర్) ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం చూపారని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కేటీఆర్ గుర్తు చేశారు.