Site icon HashtagU Telugu

Munugode bypoll Schedule: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్.. వివరాలు ఇదిగో!

Munugode Date

Munugode Date

తెలంగాణలో సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు.. ఉప ఎన్నికలు కూడా తీవ్ర ఉత్కంఠత రేపుతున్నాయి. అందుకు ఉదాహరణే హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఆ స్థాయిలో చర్చనీయంశమవుతోంది మునుగోడు ఉప ఎన్నిక. మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) ఎప్పుడెప్పుడా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అక్కడి స్థానికులు మాత్రమే కాదు.. తెలంగాణలోని ఇతర ప్రాంతాలు ప్రజలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ .. ఈ మూడు పార్టీలు కూడా మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు..? లాంటి విషయాలు చర్చనీయాంశమమైంది. కొద్దిరోజుల్లోనే ఉప ఎన్నిక రాబోతోందని బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మునుగోడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్

ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదల

ఈ నెల 14 వరకు నామినేషన్ల తుది గడువు

నవంబర్ 3 న పోలింగ్

నవంబర్ 6 న కౌంటింగ్

నవంబర్ 8తో ఉప ఎన్నిక ప్రక్రియ ముగింపు