Site icon HashtagU Telugu

Munugode Bypoll: రాజగోపాల్ కు ఎలక్షన్ కమిషన్ నోటీస్ !

Rajagopal Reddy

Rajagopal Reddy

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికే ఎలక్షన్ కమిటీ తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ ఇవ్వగా, తాజాగా బిజెపి అభ్యర్థి కె రాజగోపాల్ రెడ్డికి మరోషాక్ ఇచ్చింది. ఓటర్ల కోసం 5.24 కోట్ల రూపాయలను బదిలీ చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి అక్టోబర్ 14న రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం ఓటర్లకు లంచం ఇవ్వడం వంటి అవినీతి చర్యలు, నేరాలను నివారించడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) నిబంధనపై ఎన్నికల సంఘం గురి పెడుతోంది.

మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులే కీలకం. తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి ఎలాంటి అడ్డంకుల్లేవు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎక్కడ పైసా కదిలిస్తే అక్కడ దొరికిపోతోంది. చివరికి బైకుల మీద తరలించాలన్నా.. పట్టేసుకుంటున్నారు. ఈ సమాచారం అంతా ఎలా తెలుస్తోందోనని బీజేపీ నేతలు మథనపడుతున్నా… బయటకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకూ రూ. పదిహేను కోట్లకుపైగా దొరికింది. దీంతో రాజగోపాల్ రెడ్డి.. నేరుగా బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.