Site icon HashtagU Telugu

🔴 LIVE Update Munugode Counting: 12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ జోరు

New Web Story Copy

New Web Story Copy

తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠత రేపిన మునుగోడు ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లు, ఈవీఎంల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు తుదిఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రదర్శిస్తారు.

ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు మూడు దఫాలుగా శిక్షనిచ్చారు. జిల్లా ఎన్నికలాధికారి వినయ్ కృష్ణా, ఆర్వో రోహిత్ సింగ్, కేంద్రం నుండి వచ్చిన ముగ్గురు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరగనుంది. ఏజెంట్లు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, ఈసీ ఇచ్చిన గుర్తింపు కార్డులను చూపితేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత కల్పించారు. సీసీ కెమెరాల నిఘా, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల నుండి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు.

కౌంటింగ్‌ కోసం 21 టేబుళ్లు ఏర్పాటు

15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్‌

మధ్యాహ్నంలోపే ఉప ఎన్నిక తీర్పు