Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్ దే విజయం!

మునుగోడు ఉప ఎన్నికలో నిన్న 90 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • Written By:
  • Updated On - November 4, 2022 / 12:53 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో నిన్న 90 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుండగా, అన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఆర్‌ఎస్‌కే ఎక్కువ విజయ అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 40 శాతానికి పైగా ఓట్లతో టిఆర్ఎస్ మునుగోడు గెలుచుకోగా, బిజెపి, కాంగ్రెస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ‘‘ఎస్‌ఏఎస్ గ్రూప్, హెచ్‌ఎంఆర్, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్, త్రిశూల్ కన్సల్టింగ్ సర్వీసెస్’’ లాంటివి బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు, మూడు స్థానాలకు పరిమితమవుతాయని అంచనా వేసింది.

మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టులో బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన బీజేపీ టికెట్‌పై పోటీలోకి దిగారు. 2018లో రాజగోపాల్‌ రెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దింపింది.

కాగా మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డి ని కాంగ్రెస్‌ నేత పోటీకి దింపారు. వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నిక ఫలితం గెలుపొందిన పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది. మూడు ప్రధాన పార్టీలు ఓటర్లకు బంగారం ఇస్తామని వాగ్దానం చేయడం కూడా ఈ ఉప ఎన్నికలో వినిపించింది. కాగా నవంబర్ 6న ఓట్ల లెక్కింపులో మునుగోడు కింగ్ ఎవరు అనేది తెలిసిపోతోంది.

SAS Group

Parties               Percentage
TRS                           41-42
BJP                            35-36
Congress                16.5-17.5

HMR

Parties                Percentage
TRS                            42.13
BJP                             31.98
Congress                   21.06

Third Vision Research and Services

Parties          Percentage
TRS                      48-51
BJP                      31-35
Congress             13-15

Trishul Consulting Services

Parties        Percentage
TRS                      47
BJP                      31
Congress            18