Site icon HashtagU Telugu

Munugode Bypoll : రికార్డు బద్దలు కొట్టిన మునుగోడు…90శాతంపైగా పోలింగ్ నమోదు..!!

Munugode

Munugode

అంతా ఊహించినట్లుగానే జరిగింది. మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో మునుగోడులో పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఉదయం జరిగిన ఉపఎన్నిక పొలింగ్ కు ఉదయం కాస్త నెమ్మదిగా చేరుకున్న ఓటర్ల…సాయంత్రంకల్లా ఊపందుకుంది. చివరి గంటలో ఓటర్లు పెద్దెత్తున తరలివచ్చి ఓటను వినియోగించుకన్నారు. సాయంత్రం 6 దాటినా క్యూలైన్లో ఓటర్లు ఉండటంతో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. కొన్ని పోలింగ్ బూతులలో రాత్రి 10గంటల వరకు సాగింది. అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ముగిశాక…వివరాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు. మొత్తం 92శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ ప్రకటించారు.

2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారిలో సగం మంది మహిళలు ఉన్నారు. 47 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఖరారు చేశారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పోలింగ్ అధికారులు పర్యవేక్షించారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆగస్టులో బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో దిగితే…టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 6 ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు తర్వాత…వీరందరి భవితవ్యం తేలనుంది. మునుగోడు ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలిపోతుంది.

 

Exit mobile version